వైసీపీ నేతలపై బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. టీటీడీ గోశాల వంటి సున్నితమైన అంశాన్ని కూడా వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగారంటూ ఆయన మండిపడ్డారు. గత మూడు నెలల కాలంలో 44 ఆవులు చనిపోయాయనేది నిజమేనని… వయసు రీత్యా, అనారోగ్య కారణాలతో అవి మృతి చెందాయని చెప్పారు. వేల ఆవులు ఉన్న చోట ఇలాంటి మరణాలు సహజమేనని అన్నారు.గోశాలలో ఏం జరుగుతోందో చూపిస్తాం రమ్మంటే రాకుండా వైసీపీ నేతలు ఇంటి దగ్గర పడుకుని డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.మడకశిరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Post Views: 5









