ప్రత్యేక పూజల పేరిట ఓ మహిళను మోసం చేసిన అఘోరీని చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. అఘోరీపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మహిళ తన వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం అఘోరీని ఆశ్రయించగా, అతను ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలు తీరతాయని నమ్మించాడట. దాంతో ఆమె విడతలవారీగా సుమారు రూ.10 లక్షలు చెల్లించింది. అయితే కష్టాలు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది.
అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన కోర్టు, అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అతడిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోంది.
అఘోరీ ఇటీవల వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిని మధ్యప్రదేశ్, యూపీ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అఘోరీని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, వర్షిణిని కౌన్సిలింగ్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.









