మన వంటగదిలో అందుబాటులో ఉండే అల్లం కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం. నిత్యం ఆహారంలో చిన్న అల్లం ముక్కను ఉపయోగించడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శతాబ్దాలుగా భారతీయ ఆయుర్వేదంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.
అల్లంలో జింజెరాల్, షోగావోల్, జింజిబెరీన్ అనే సమ్మేళనాలు ఉండటం వల్ల ఇది శరీరంలో వాపు తగ్గించడంలో, నొప్పులను శాంతింపజేయడంలో సహాయపడుతుంది. అల్లం వాంతులు, వికారం, జీర్ణక్రియ లోపాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. గర్భవతుల Vikaram, Chemotherapy తీసుకునేవారిలో కూడా ఇది చాలా ఉపశమనం ఇస్తుంది.
అల్లం తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. అలాగే రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అల్లం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరం త్వరగా కోలుకుంటుంది. రోజూ 1.5 సెంటీమీటర్ల అల్లం ముక్కను టీ, సూప్, కూరలతో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా అల్లం సహజ ఔషధంగా మన ఆరోగ్య సంరక్షణలో భాగంగా చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.









