పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓ విశ్రాంతి తర్వాత మళ్లీ బరిలోకి దిగుతోంది. చివరిసారి ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఎస్ఆర్హెచ్, ఆ తర్వాత కొంత విరామం తీసుకుని మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లొచ్చారు. విశ్రాంతి అనంతరం ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది.
టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన ప్రకటించారు. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. కరీమ్ జనత్ స్థానంలో గెరాల్డ్ కోట్జీని ఆడిస్తున్నారు. ఈ మార్పుతో గుజరాత్ బౌలింగ్ విభాగంలో కొత్త శక్తిని పొందే అవకాశం ఉంది.
పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. ప్రస్తుతం వారు 9వ స్థానంలో ఉన్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కోసం ఒక ‘చావోరేవో’ పోరుగా మారింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ప్రతి మ్యాచ్‌ను గెలవడం తప్పనిసరిగా మారింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన తాలూకు ఎనర్జీతో, పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ హోరాహోరీ పోరుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









