పవన్ కల్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తి – ఫస్ట్ లుక్ అదిరింది

Pawan Kalyan's action-thriller 'OG' wraps up shoot. Makers release a powerful new poster, building massive excitement among fans.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు సంతోషం కలిగించే అప్‌డేట్ వచ్చింది. ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాస్ మేకోవర్‌లో ఉన్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో అభిమానుల్లో ఊపెత్తే జోష్ కనిపిస్తోంది.

దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కల్యాణ్ ఇందులో ఓ ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండటంతో, ఈ సినిమా ఆయన కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజా పోస్టర్‌లో పవన్ స్టైల్, స్టాన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

“అన్ని షూటింగ్‌లు అయిపోయాయి… ఇప్పుడు థియేటర్ల వంతు.. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది” అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ అప్‌డేట్‌ను షేర్ చేశారు. సినిమా షూటింగ్ పూర్తి కావడం, విడుదల తేదీ సమీపిస్తున్న దృష్ట్యా, ప్రమోషనల్ యాక్టివిటీలు త్వరలో ఊపందుకోనున్నాయి.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరపై అడుగుపెడుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ‘ఓజీ’ని టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share