ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ ఓటీటీ ఫ్యాన్స్‌కు ఓ కొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. ప్రాణాలను పణంగా పెట్టి ఆటలు ఆడే సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా, ఈ సిరీస్ సీజన్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. దీనికి సంబంధించిన ఓ వినూత్న ఏఐ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ వైరల్ వీడియోలో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ స్క్విడ్ గేమ్‌లో పాల్గొన్నట్లు చూపించడం విశేషం. ఆయనతో పాటు నటి అనసూయ భరద్వాజ్, నటుడు రాజీవ్ కనకాల కూడా ఈ గేమ్‌లో భాగమయ్యారు. ఈ వీడియోలో బాలయ్య తన సినిమాల నుంచి తీసిన పవర్ఫుల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో స్క్విడ్ గేమ్ సెట్లో పోటీ పడుతున్నట్లు చూపించడమే స్పెషల్ అట్రాక్షన్. ఆయన తీరే ఏదైనా స్పెషల్‌గానే ఉంటుంది కాబట్టి, ఈ వీడియోలో కూడా అదే ఎనర్జీ కనిపిస్తోంది.
బాలయ్య స్క్విడ్ గేమ్‌లో కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. టఫ్ ఛాలెంజ్‌లను ఎదుర్కొంటూ, తనదైన స్టైల్లో ప్రత్యర్థులను ఛేదించడం చూసి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. “బాలయ్య ఆడితే ఎవరూ మిగలరే బాబోయ్!” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తున్నారు. వీడియోలో అనసూయ, రాజీవ్ కనకాలలు కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తూ మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
ఈ వీడియోలోని హాస్యం, విజువల్స్, మరియు బాలయ్య స్టైల్‌ను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో షేర్లు, లైక్స్ పొందిన ఈ వీడియోపై ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు కూడా దూసుకుపోతున్నాయి. టెక్నాలజీ, సినీ ప్రేమికులకు ఇది ఓ వింటేజ్ ట్రీట్‌లా మారింది. అభిమానులు మళ్లీ మళ్లీ ఈ వీడియోను చూశేలా ఆకర్షణీయంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో స్క్విడ్ గేమ్ అభిమానుల్లోనూ టాలీవుడ్ ఫ్యాన్స్‌లోనూ ఓ సెన్సేషన్‌గా మారింది.









