జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం నేపథ్యంలో ఇప్పటివరకు వెలుగులోకి రాని మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నటి మారియా ఫార్మర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. 1995లో తనకు 20 ఏళ్లు ఉన్న సమయంలో ట్రంప్ తనను అసౌకర్యంగా చూసిన ఘటనను వివరించారు.
మారియా ఫార్మర్ తెలిపిన ప్రకారం, ఆ సమయంలో ఎప్‌స్టీన్ కోసం పనిచేయబోతున్న సమయంలో ఒక రోజు రాత్రి అతనికి కాల్ చేసి తనను ఆఫీసుకు రమ్మని చెప్పాడట. ఆ సమయంలో నైట్ డ్రస్సుతోనే వెళ్లిన తనను అక్కడికి వెళ్లినపుడు ట్రంప్ చూడగా, అతని చూపులు తన కాళ్లవైపు ఉండిపోయాయని చెప్పారు. దీనితో తాను చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని మారియా తెలిపారు.
అయితే అప్పుడు అక్కడికి వచ్చిన ఎప్‌స్టీన్ ట్రంప్‌కు “నో నో.. ఆమె నీ కోసం కాదు” అని చెప్పిన సంఘటనను కూడా మారియా వెల్లడించారు. ఈ సంఘటనను ఆమె అప్పటి నుంచే మదిలో ఉంచుకున్నప్పటికీ, ఇప్పుడు బయటపెట్టడానికి కారణం – ఎప్‌స్టీన్ కేసుపై ప్రజల చైతన్యమని చెప్పారు. ఎప్‌స్టీన్ మరియు గిల్లైన్ మ్యాక్స్‌వెల్‌పై 1996లోనే తాను ఆరోపణలు చేసినట్లు ఆమె గుర్తుచేశారు.
మారియా ఆరోపణలపై వైట్ హౌస్ స్పందిస్తూ, ట్రంప్ ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని చాలా కాలం క్రితమే వదిలేశారని స్పష్టం చేసింది. ట్రంప్ ఎప్పుడూ ఎప్‌స్టీన్ ఆఫీసుకు వెళ్లలేదని, ఇది నిరాధారమైన ఆరోపణ అని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చెప్పారు. అయితే ఈ ఆరోపణలు ట్రంప్ గతంపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.









