కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఐపీఎల్ 2026కు ముందు తమ కోచింగ్ బృందంలో పెద్ద మార్పులు చేసింది. ఇటీవలే హెడ్ కోచ్ స్థానంలో చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని వదిలి, అభిషేక్ నాయర్‌ను నియమించగా, సాహాయక కోచ్‌గా షేన్ వాట్సన్ ను నియమించింది.
తాజాగా, న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీని బౌలింగ్ కోచ్‌గా నియమించటం జరిగింది. ఈ విషయాన్ని KKR తమ అధికారిక సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. సౌథీ ముందు భారత్ అరుణ్ KKR బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు.
KKR సీఈఓ వెంకీ మైసూర్ ప్రకారం, “కేకేఆర్ కుటుంబంలోకి మళ్లీ సౌథీకి స్వాగతం పలకుతున్నాం. అతని అనుభవం, సాంకేతిక నైపుణ్యం మా జట్టు బౌలింగ్ విభాగానికి ఎంతో ఉపయోగపడుతుంది. అతని నాయకత్వ లక్షణాలు యువ బౌలర్లకు మార్గనిర్దేశం చేస్తాయి” అని పేర్కొన్నారు.
ఈ మార్పులతో KKR బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, యువ బౌలర్లకు సరైన పాఠాలు అందిస్తూ, ఐపీఎల్ 2026లో జట్టు ప్రతిష్టను పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.









