రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటులు, సెలబ్రిటీలను సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి నేడ సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
సీఐడీ విచారణలో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినప్పుడు వీరు ఎంత మొత్తంలో డబ్బులు పొందారో, యాప్స్ నిర్వాహకులతో వారి సంబంధం, డబ్బుల లావాదేవీలు ఎలా జరిగాయో వంటి అంశాలను క్రమంగా అడిగి తెలుసుకుంటోంది.
ఈ కేసులో ఇప్పటికే రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు కూడా సీఐడీ సమక్షంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు ఈ కేసులో సెలబ్రిటీల పాత్రను సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
సీఐడీ ఆధ్వర్యంలో జరుగు దర్యాప్తు ప్రకారం, అక్రమంగా నడిచిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దిశగా చర్యలు తీసుకోవడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.









