న్యాల్కల్ మండలం గణేష్ గ్రామ శివారులోని హజ్రత్ సయ్యద్ షా మమ్మద్ పీర్ చిస్తీ దర్గా వద్దకు వెళ్లిన కాలువపల్లి నర్సింలు (75) శుక్రవారం అదృశ్యం అయ్యాడు. కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్కు చెందిన నర్సింలు ఈనెల 20న తన అన్న కొడుకుతో కలిసీ దర్గా వద్దకు వచ్చారు.
వృద్ధుడి కొడుకు శ్రీరామ్ నాయుడు కొద్దిసేపు బాత్రూంకి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్లాడు. దర్గా వద్దకు తిరిగి వచ్చినప్పుడు నర్సింలు కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద కూడా ఆయన ఆచూకీ లభించలేదు.
నర్సింలు గత మూడు నెలలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఎటు వెళ్లాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియడం లేదు. తన తండ్రి అదృశ్యమైనట్లు కొడుకు శ్రీరామ్ నాయుడు హద్దునూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అదృశ్యమైన వృద్ధుడు తెలుపు షర్ట్, పంచ కట్టుకుని ఉన్నాడని ఎస్ఐ సుజిత్ తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే హద్దునూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించమని కోరారు.









