నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా స్త్రీకి సామాజిక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ పై నిర్మించబడింది.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ ఇద్దరూ సినిమాను మెచ్చుకున్నారు.
రష్మిక మందన్నా నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. భూమా పాత్రలో ఆమె కేవలం నటించలేదు, జీవించింది అని చెప్పే స్థాయి నటన కనబరిచింది.
‘ది గర్ల్ ఫ్రెండ్’ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కొందరు నెటిజన్లు, క్రిటిక్స్ ఈ సినిమాకు రష్మిక అవార్డులు అందుకోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.
Post Views: 11









