కొత్త ఔషధాలను కనుగొనడానికి, వాటి పనితీరును సరిచూడడానికి చాలా పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ట్రయల్స్‌లో మానవులు, జంతువులపై పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అవి ప్రమాదకరంగా మారతాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
తాజాగా, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రివ్యూ ప్రకారం, శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో సింథటిక్ మానవ, జంతు శరీరాలను తయారు చేస్తున్నారు. వీటిని ‘బాడీ ఆయిడ్స్’ అని పిలుస్తారు. ఇవి నిజమైన మానవ జీవశాస్త్రాన్ని అనుకరించేలా రూపొందించబడ్డాయి, కానీ స్పృహ లేదా నొప్పి వంటి అంశాలు ఉండవు.
ఈ సింథటిక్ శరీరాలను స్టెమ్ సెల్స్ ద్వారా రూపొందిస్తారు, మెదడు లేదా న్యూరల్ కాంపోనెంట్స్ లేకుండా ఉంటాయి. దీని వల్ల భావోద్వేగాలు, అవగాహన లాంటివి లేవు. అందువలన, ఔషధాల పరీక్షలు మరియు వ్యాధుల అధ్యయనం కోసం భద్రతగా ఉపయోగించవచ్చు.
బాడీ ఆయిడ్స్ ఉపయోగించడంతో జంతు ప్రయోగాలపై ఆధారపడకూడదు. ఇవి మానవ జీవశాస్త్రాన్ని కచ్చితంగా అనుకరిస్తాయి, పరీక్షల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ సాంకేతికత, భవిష్యత్తులో అవయవాల ట్రాన్స్‌ప్లాంట్, వ్యాధుల అధ్యయనంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.









