హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు 150 రోజుల పనిలో భాగంగా వర్షాకాలంలో నగర ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర వహించాయి. క్యాచ్పిట్లు, కల్వర్ట్లు, నాలాలు పూడికలను తగిన విధంగా నిర్వహించి వర్షాలు వచ్చినప్పటికీ వరదలు ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, “ముప్పు ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తూ సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా సమస్యలకు కారణాలను కూడా గుర్తించి పనిచేశారని” అభినందించారు. ఈ వర్షాకాలంలో అనేక క్లౌడ్ బర్స్, భారీ వర్షాలు ఎదురయ్యినప్పటికీ, మెట్ టీమ్‌ల సమర్థత నిరూపితమైంది.
ఈ సందర్భంగా వ్యక్తిగత, ఆర్థిక, జీవన విధాన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. అలాగే, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లలో ఉత్తమంగా పనిచేసిన 30 మందికి ప్రశంసాపత్రాలు, బహుమతులు, శాలువ్లను హైడ్రా కమిషనర్ అందజేశారు.
అమీర్‌పేట, ప్యాట్నీ వంటి ప్రాంతాల్లో నాళాల పూడిక తొలగించి వరద ముప్పు నివారించడంలో సిబ్బంది ఘన సేవలు చేశారు. డీఆర్ఎఫ్, ఎస్ఎఫ్ వోలు బృందాల నిబద్ధత, ప్రణాళికా విధానం హైడ్రా కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ వర్క్స్, మరియు అడ్మిన్ SPR. సుదర్శన్ ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.









