ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌కు చెందిన డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’ (Pathang). సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌కు కొత్త అనుభూతిని అందించే కథతో ఈ సినిమా రూపొందినట్లు మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రంలో ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు పాపులర్ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యువతకు దగ్గరగా ఉండే పాత్రలతో పాటు బలమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని చిత్రబృందం వెల్లడించింది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ ఈవెంట్లో ‘పతంగ్’ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవకట్టా మాట్లాడుతూ ట్రైలర్ ఎంతో ఎనర్జిటిక్‌గా, ఎంటర్టైనింగ్గా అనిపించిందన్నారు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తీశారని, ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్ ఫీలింగ్ వచ్చిందని పేర్కొన్నారు. ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
‘పతంగ్’ తప్పకుండా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తుందని, కొత్త రకమైన అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు దేవకట్టా. రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్‌తో పాటు యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా పెరిగిందని, డిసెంబర్ 25 విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.









