ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే మూడో టీ20కు కూడా అక్షర్ అందుబాటులో లేకపోయిన విషయం తెలిసిందే.
బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 17న లక్నోలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌కు అక్షర్ పటేల్ ఆడబోడని స్పష్టం చేసింది. జట్టు వైద్య బృందం సూచనల మేరకు అతడికి విశ్రాంతి కల్పించినట్లు బోర్డు వెల్లడించింది.
అక్షర్ స్థానంలో బెంగాల్‌కు చెందిన ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ స్థిరమైన ప్రదర్శనతో గుర్తింపు పొందిన షహబాజ్‌కు ఇది కీలక అవకాశంగా మారనుంది. అతని ఆల్‌రౌండ్ సామర్థ్యం జట్టుకు ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఇప్పటికే భారత్–సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు పూర్తవగా, భారత్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సిరీస్ గెలవాలంటే భారత్‌కు ఇంకా ఒక విజయం మాత్రమే అవసరం. అక్షర్ లేమి ఉన్నప్పటికీ, మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.









