ఎంగేజ్మెంట్ రింగ్‌తో స్మృతి మందాన మెరుపులు

Smriti Mandhana’s appearance with a ring at a private event has gone viral, sparking speculation about her personal life.

భారత లేడీ క్రికెటర్ స్మృతి మందాన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ కోహ్లీగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, భారత మహిళల క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. తొలి వరల్డ్ కప్ నుంచే కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు బలంగా నిలిచిన స్మృతి, తన ఆటతీరుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. క్రీడా జీవితంలో సక్సెస్ సాధించిన ఆమె, వ్యక్తిగత జీవితంతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

ఇటీవల స్మృతి మందాన వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది. గత నవంబర్‌లో జరగాల్సిన ఆమె వివాహం చివరి నిమిషంలో నిలిచిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. వివాహం రద్దుకు సంబంధించి రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా పలాష్‌కు సంబంధించిన కొన్ని ఆరోపణల నేపథ్యంలోనే పెళ్లి ఆగిపోయిందన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.

పెళ్లి రద్దు తర్వాత తొలిసారిగా స్మృతి మందాన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె ఎంగేజ్మెంట్ రింగ్‌తో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్మృతి లుక్, ఆత్మవిశ్వాసం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎంగేజ్మెంట్ రింగ్‌తో స్మృతి మందాన కనిపించడంతో పలాష్‌తో ఇంకా ఆమె డేటింగ్‌లోనే ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరి వివాహం మళ్లీ జరగవచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం అది ఎంగేజ్మెంట్ రింగ్ కాదని, కేవలం ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై స్మృతి మందాన నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share