నగరం పరిధిలోని పైడిపల్లి గ్రామంలో మైసమ్మ ఆలయాన్ని అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ప్రజలు, కేవలం హిందూ ఆలయాలను లక్ష్యం చేసుకున్నారని విమర్శలు చేస్తున్నారు.
చాలా చోట్ల ముందస్తు నోటీసులు లేకుండా, అర్ధరాత్రి వేళల్లో కూల్చివేతలు చేపట్టడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని సృష్టించిందని వారు పేర్కొన్నారు. గంట రవికుమార్ వెంటనే పునర్నిర్మాణం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక పెద్దవారు మైసమ్మ ఆలయం కూల్చడం “మహాపాపం” అని, ఇది ప్రజల నమ్మకాన్ని అవమానపరచడం, ఊరి రక్షణ శక్తిని తగ్గించడం అని అన్నారు. కొంతమంది స్థానికులు, ఇది మున్సిపల్ సిబ్బంది చర్యా, లేక ప్రైవేట్ వ్యక్తుల కోసం ఉందా అనే అనుమానాలను వ్యక్తం చేశారు.
ప్రజలు రహదారి పక్కన ప్రమాదాలు జరగకుండా మైసమ్మను ప్రతిష్టిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం, ధార్మిక భావాలను దెబ్బతీసే ఈ చర్యపై విభిన్న వర్గాల ప్రజలు ఖండన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు “మైసమ్మ తల్లి అంటే భక్తి, నమ్మకం… దాన్ని కూల్చడం మానవత్వానికి విరుద్ధం” అని అన్నారు.









