టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే వరుసగా భారీ అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి టాప్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే కాలం మారడంతో పాటు అవకాశాల పరిస్థితి కూడా మారింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాలో తొలుత పూజా హెగ్డేకు అవకాశం ఇచ్చినా, తర్వాత ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించి శ్రీలీలను తీసుకున్నారు. ఈ పరిణామం తర్వాత తెలుగులో పూజా హెగ్డేకు పెద్దగా అవకాశాలు రాలేదనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులో ఛాన్సులు తగ్గినా, తమిళ ఇండస్ట్రీలో మాత్రం పూజా హెగ్డేకు అవకాశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఒక ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు తన గ్లామర్‌తో మరోసారి చర్చకు వచ్చింది. దీంతో ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి నేపథ్యంలో తెలుగులో కూడా ఐటెం సాంగ్ చేయడానికి పూజా హెగ్డే సిద్ధమైందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. హీరో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, తొలుత తమన్నాను అనుకున్నప్పటికీ ఇప్పుడు పూజా హెగ్డే పేరు వినిపిస్తోందని టాక్. ఐటెం సాంగ్ అయినా సరే, అవకాశాన్ని వదులుకోకూడదని పూజా హెగ్డే కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.









