కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో CEIR పోర్టల్ సాంకేతికతను వినియోగిస్తూ సుమారు రూ. 18 లక్షల 20 వేల విలువ గల 91 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సీపీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సీపీ గౌష్ ఆలం రూరల్ పోలీస్ స్టేషన్ టెక్నికల్ టీమ్ సభ్యులు కానిస్టేబుళ్ళు విశ్వతేజ, రాంసాయి, కీర్తనలను ప్రత్యేకంగా అభినందించి, వీరి ప్రతిభను గుర్తించి త్వరలో రివార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
రికవరీ ఫలితాల్లో మానకొండూర్ (75%), కరీంనగర్ రూరల్ (73%) అత్యుత్తమంగా నిలిచినట్లు తెలిపారు. చొప్పదండి, ఇల్లందకుంట, రామడుగు స్టేషన్లు 70% రికవరీ సాధించగా, కరీంనగర్ వన్ టౌన్ అత్యధికంగా 1,011 ఫోన్లను గుర్తించి రికార్డు సృష్టించింది.
ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు నరేష్, లక్ష్మా రెడ్డి, ఇతర సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు. పోలీసుల సమర్థ విధానంతో ప్రజలకు ఊరట కలిగిందని సీపీ తెలిపారు.









