మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల అక్షితపై రెండు కుక్కలు దాడి చేశాయి. దాడి కారణంగా చిన్నారి మొహానికి తీవ్ర గాయం అయ్యింది.
కుటుంబ సభ్యులు వెంటనే నారాయణపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు మరింత మెరుగైన చికిత్స కొరకు మహబూబ్ నగర్‌లోని ఆసుపత్రికి తరలించమని సూచించారు.
ప్రజలు తెలిపారు, గతంలో మండలంలో దాదాపు 40 మంది చిన్నారులపై కుక్కల దాడి జరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు. కొద్ది రోజుల క్రితం కుక్కలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ సిక్త్ పట్నాయక్‌కు సమాచారం అందించగా ఇప్పటివరకు చర్య తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు మళ్లీ అధికారులు స్పందించి కుక్కల నుంచి పిల్లల ప్రాణాలను రక్షించాలని వేడుకుంటున్నారు.
Post Views: 9









