నూతన సంవత్సర వేడుకలలో యువత ఉల్లాసంగా పాల్గొంటున్నారు. కొందరు ఆహారంతో సెలబ్రేట్ చేస్తుంటే, మరికొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
హన్మకొండ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ రికార్డులలో సరికొత్త ఘట్టం జరిగింది. బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించినప్పుడు ఓ వ్యక్తికి 432 రీడింగ్ నమోదయింది. సాధారణంగా రక్తంలో 30 మిల్లీగ్రామ్లు/100 మి.లీ. కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే నేరంగా పరిగణిస్తారు.
పోలీసుల ప్రకారం, ఈ 432 రీడింగ్ 2025లో అత్యధికంగా నమోదయినట్లు పేర్కొన్నారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం తీసుకుని నేరానికి తగిన చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Post Views: 19









