మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ విజయం అనంతరం చిరు తన తదుపరి ప్రాజెక్ట్ ‘మెగా 158’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి చిరంజీవికి కుమార్తె పాత్రలో కనిపించనుందనే సమాచారం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘మెగా 158’లో మరో స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. ఇది కేవలం అతిథి పాత్ర కాకుండా కథను కీలక మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ వార్తపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుండగా, మెగా అభిమానులు ‘బొమ్మ బ్లాక్ బస్టరే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి–మోహన్‌లాల్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయనుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.









