సిద్ధు పుట్టినరోజున సితార బిగ్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ లభించింది. సిద్ధు తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్‌ను విడుదల చేశారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ షేర్ చేసిన క్యాప్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. “మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తాడు… ఈసారి అతను మరోసారి తెరలను షేక్ చేయబోతున్నాడు” అంటూ ఇచ్చిన హింట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సిద్ధు ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
పుట్టినరోజు రోజే ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ రావడంతో సోషల్ మీడియా వేదికగా సిద్ధుకు అభిమానులు, సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది సిద్ధు నటించిన ‘తెలుగు కదా’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆ ఫలితంతో ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరో పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ చిత్రానికి స్వరూప్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది ఈ బ్యానర్‌లో రూపొందుతున్న 40వ సినిమా కావడం విశేషం. సిద్ధు–సితార కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share