టీ20 వరల్డ్ కప్ ముందు టీమ్ ఇండియాకు బుమ్రా షాక్

టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాకముందే భారత జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత గడ్డపై ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆడుతున్న టీమ్ ఇండియాను గాయాలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా జట్టుకు దూరమవ్వగా, ఇప్పుడు మరో కీలక ఆటగాడి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ వార్త రావడం అభిమానులను కలవరపెడుతోంది.
భారత జట్టులో ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అమెరికాతో శనివారం జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్ని రోజులుగా బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. జ్వరం, నీరసం కారణంగా ఆయన పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేరని తెలుస్తోంది. దీంతో మ్యాచ్‌కు ముందు జరిగిన కీలక ప్రాక్టీస్ సెషన్లకు కూడా బుమ్రా హాజరు కాలేదు.
శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీమ్ ట్రైనింగ్ సెషన్‌లో బుమ్రా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీలో భారత్‌కు అత్యంత కీలకమైన బౌలర్ కావడంతో, అతడిని రిస్క్‌లో పెట్టకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కోలుకోకుండా ఆడితే, టోర్నీ మొత్తం మీద ప్రభావం పడే అవకాశం ఉందన్నది సెలెక్టర్ల ఆందోళన.
ఒకవేళ బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే, అమెరికాతో జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆయన స్థానంలో మరో పేసర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హర్షిత్ రాణా దూరమవ్వడంతో బౌలింగ్ విభాగంపై ఒత్తిడి పెరిగింది. బుమ్రా పరిస్థితిపై మ్యాచ్‌కు ముందు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుండగా, అభిమానులు మాత్రం అతడు త్వరగా కోలుకుని మైదానంలోకి దిగాలని ఆశిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share