ఉగ్రదాడిలో మృతుడికి పవన్ నివాళి, 50 లక్షల సాయం

Pawan Kalyan announces ₹50L aid to Somishetti's family, emotionally reacts to the trauma faced by the victim's 10-year-old son.

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావు గారి స్మృతికి గౌరవంగా ఇవాళ జనసేన పార్టీ నివాళి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ కుమారుడు ఎదుర్కొంటున్న మానసిక బాధను తలచుకుని ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇటీవల తన కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఘటనను గుర్తు చేశారు. “అతడికి కలల్లో కూడా భయం వస్తోంది. మేము సైకియాట్రిస్ట్ ను కలుస్తున్నాం” అని పేర్కొన్నారు. అలాంటిది ఒక పసి బాలుడు తన తండ్రిని కళ్లముందే ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని చూసినప్పుడు అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేమని పవన్ అన్నారు.

తండ్రిని కోల్పోయిన ఆ పదేళ్ల బాలుడి బాధను చూసి హృదయం కలచిపోయిందని పవన్ తెలిపారు. అటువంటి సంఘటన నుంచి ఆ కుటుంబాన్ని కొంతవరకైనా ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇది కేవలం డబ్బుగా కాదు, “మా పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంది” అనే భరోసాగా ఉందన్నారు.

జనసైనికుల సేవలను గుర్తిస్తూ, వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా జనసేన వారి వెంట నిలబడుతుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మధుసూదన్ రావు కుటుంబానికి menthal, social మరియు financial భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ తరపున ఎప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉండబోతున్నామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share