హైదరాబాద్‌లో సైబర్ సెక్స్ టార్షన్ కేసు వెలుగులోకి వచ్చింది. గౌలిగూడ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి మధ్యాహ్న సమయంలో అనుమానాస్పద వీడియో కాల్ వచ్చింది. కాల్ ఆన్ అవగానే ఒక యువతి అందంగా మాట్లాడి, అశ్లీల కతనాలతో వ్యక్తిని రెచ్చగొట్టింది. ఆ సమయంలో కాల్ విరమించబడింది. కొంత కాలం తర్వాత మరొక వీడియో కాల్ వచ్చింది.
ఈ రెండవ కాల్‌లో యూనిఫాం ధరించి ఉన్న వ్యక్తి, తనను విక్రం గోస్వామి గా పరిచయం చేసి, వ్యక్తిని బెదిరించాడు. అతను సోషల్ మీడియాలో యువతితో జరిగిన అశ్లీల వీడియోలను ప్రచారం చేస్తానని, తర్వాత ఆ యువతి చనిపోయినట్లయితే నీవు కేసులో ఇరుక్కుంటావని, అరెస్టు తప్పనిదని హెచ్చరించాడు.
భయాందోళనలో ఉన్న బాధితుడు, మోసగాళ్ల డిమాండ్ మేరకు మొత్తం 3.41 లక్షల రూపాయలను ఫోన్‌లో ఇచ్చిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. ఆ తర్వాత మరింత డబ్బులు కావాలని, ఒత్తిడిని కొనసాగిస్తూ మళ్లీ ప్రయత్నం జరిగినందున బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి గుర్తు తెలియని మహిళల నుంచి వచ్చే అనుమానాస్పద వీడియో కాల్స్ కు స్పందించకూడదని, వారితో ఎప్పటికీ మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నారు. సైబర్ సెక్స్ టార్షన్ వంటి ఘటనల్లో బాధితులు వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.









