ఆస్ట్రేలియాలో ఎన్నికల రోజున ఓటింగ్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశం ‘డెమోక్రసీ సాసేజ్’. ఇది ఏకకాలంలో ఆహారపు రుచి, ప్రజాస్వామ్య గౌరవం, ఆస్ట్రేలియా సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే స్టాల్స్‌లో బ్రెడ్‌లో ఉల్లిపాయ, కెచప్‌తో కలిపిన కాల్చిన సాసేజ్ అందించబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల రోజున ఓ ప్రత్యేక సంప్రదాయంగా మారింది.
ఈ సాసేజ్ విశేషం ఏంటంటే, విదేశాల్లోని ఆస్ట్రేలియన్లు ఓటు వేయగల కేంద్రాల్లో కూడా దీనిని అందుబాటులో ఉంచుతున్నారు. టోక్యో నుంచి నైరోబీ వరకూ, న్యూయార్క్ నుంచి అంటార్కిటికా పరిశోధనా కేంద్రాల వరకూ ఈ డెమోక్రసీ సాసేజ్ సాంస్కృతిక ప్రాధాన్యం పొందింది. దీనిపై ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ కూడా ఉంది — democracysausage.org.
ఆస్ట్రేలియాలో ఓటింగ్‌కు ప్రత్యేక డ్రెస్సింగ్ కోడ్ లేకపోవడంతో స్విమ్‌వేర్‌లో ఓటు వేయడం ఓ వినూత్న సాంప్రదాయంగా మారింది. ‘బడ్గీ స్మగ్లర్’ బ్రాండ్ దీనికి మద్దతుగా ఉచిత స్విమ్‌వేర్ ఆఫర్ చేయడంతో, బీచ్ ప్రాంతాల్లో ఈత దుస్తుల్లో ఓటు వేయడం మామూలయ్యింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల నిబద్ధతకు చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
డెమోక్రసీ సాసేజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నాయకులపై మీమ్స్‌గా మారడం సాధారణమైపోయింది. పర్యాటకులు, విద్యార్థులు కూడా ఈ సాసేజ్‌ను ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ డిక్షనరీ సెంటర్ ఈ పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించడం దీని ప్రాచుర్యానికి నిదర్శనం.









