మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఉన్న చైతన్య డీమ్డ్ టూ బీ యూనివర్సిటీలో శబరి ప్రసాద్ సుగ్గల్ కెమిస్ట్రీ విభాగంలో “స్టడీస్ టువార్డ్స్ ది సింథసిస్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ నోవెల్ హెటెరో సైకిల్స్ అండ్ దేర్ బయాలాజికల్ ఎవాల్యుయేషన్” అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు.
ఈ ఘన కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సలర్ సీహెచ్‌వి పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా శబరి ప్రసాద్ సుగ్గల్‌కు పీహెచ్‌డీ పట్టా అందజేయబడింది. పరిశోధన ఆచార్య జగదీష్ కుమార్ ఈగ, డాక్టర్ పీ. మురళీధర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది.
చాన్సలర్ సీహెచ్‌వి పురుషోత్తం రెడ్డి శబరి ప్రసాద్ సుగ్గల్‌ను అభినందిస్తూ, ఇది రసాయన శాస్త్ర విభాగానికి మరియు విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు. పరిశోధనలు సమాజ శ్రేయస్సును అభివృద్ధి చేయడంలో కీలకమని, విద్యా పరిశోధనను ప్రభావవంతంగా చేయడం అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్, ఇతర అధికారులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ ఘన ఘట్టం రసాయన శాస్త్ర పరిశోధనలో యువ శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.









