ఆర్య చిత్రం నా జీవితాన్ని మార్చింది: అల్లు అర్జున్

On Arya’s 21st anniversary, Allu Arjun shares an emotional note, calling the film a life-changing milestone in his cinematic journey.

తెలుగు సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘ఆర్య’ సినిమా విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. 2004 మే 7న విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపుతిప్పిన మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు. “ఆర్య కేవలం ఒక సినిమా కాదు. నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ప్రయాణానికి ఆరంభం,” అంటూ తన అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ ప్రత్యేక రోజు సందర్భంగా బన్నీ #21YearsForArya అనే హ్యాష్‌ట్యాగ్‌తో వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ, అభిమానులతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. “ఆర్య సినిమా ద్వారా నాకు లభించిన ప్రేమ, మద్దతు అన్నిటికీ కృతజ్ఞతలు. అది నా జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించింది,” అని అన్నారు. ఆ సినిమా విజయం వల్ల తాను యూత్ ఐకాన్‌గా ఎదగగలిగానని బన్నీ చెప్పుకొచ్చారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేమకథా చిత్రాలకు కొత్త ఒరవడిని అందించింది. అల్లు అర్జున్ నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటూ nostalgiకను తేకుంటున్నాయి. ‘ఆర్య’ కథ, సంగీతం, ప్రేమ భావన అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఊరించాయి.

ఈ సినిమాతో అల్లు అర్జున్ సౌత్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. అనుమెహతా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తరం ప్రేక్షకుల గుండెల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. సినిమా ప్రపంచంలో అరుదైన విధంగా, ‘ఆర్య’లాంటి సినిమాలు పదేళ్ల తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ చేసిన ఈ పోస్టు అభిమానులను భావోద్వేగానికి లోనుచేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share