మహేశ్ బాబు కుటుంబంలో కోవిడ్ – శిల్పా శిరోద్కర్ పాజిటివ్

Shilpa Shirodkar, sister-in-law of Mahesh Babu, tests COVID-19 positive in Dubai amid rising global cases, urging safety precautions.

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, ఒకప్పుడు బాలీవుడ్‌లో పెద్దపేరుగా నడిచిన శిల్పా శిరోద్కర్ ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శిల్పా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె, వైరస్ సోకిన విషయం అభిమానులతో పంచుకుంటూ, అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో ఆసియా దేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సింగపూర్‌లో రోజువారీ కేసులు రెండు వేల దాటుతున్నాయి. హాంకాంగ్‌లో ఆసుపత్రులు రోగులతో నిండిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చైనాలో కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోని కోవిడ్ పాజిటివ్ కేసు దుబాయ్‌లో నివసిస్తున్న శిల్పా శిరోద్కర్‌కి సోకడంతో, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

శిల్పా శిరోద్కర్ 90వ దశకంలో బాలీవుడ్ లో ప్రముఖ నటిగా పేరొందారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, కొంతకాలం తరువాత నటనకు విరామం ఇచ్చారు. ఇటీవలే బిగ్ బాస్ 18వ సీజన్ హిందీలో ప్రసారమైన షో ద్వారా ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షో ముగిశాక పలు కమర్షియల్ ప్రకటనలు, ఫోటోషూట్లు, వెబ్ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగానే కోవిడ్ సోకినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం శిల్పా ఆరోగ్యం బాగున్నట్లు సమాచారం. అయితే, కరోనా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని కుటుంబసభ్యులు, అభిమానులు సూచిస్తున్నారు. మహేశ్ బాబు కుటుంబంలో ఈ విషయంలో అప్రమత్తత పెరిగింది. ప్రజలు కూడా మాస్కులు ధరించడం, శారీరక దూరం పాటించడం, హైజీన్ కాపాడుకోవడం వంటి మౌలిక జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share