తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ సమస్యల కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయాల్సి ఉండగా, తమిళ రాజకీయాలను టార్గెట్ చేసిన వ్యక్తిగత డైలాగ్స్ కారణంగా సెన్సార్ సమస్యలు ఎదురైంది. దీంతో చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించి, కోర్టు తీర్పును ఈ నెల 9కి రిజర్వ్ చేసింది.
చివరి నిమిషంలో ‘జన నాయగన్’ రిలీజ్ వాయిదా పడటం వలన బాక్సాఫీస్‌లో విజయ్ సినిమా ఎదుర్కోవాల్సిన భారీ పోటీ తగ్గింది. అదే రోజు రిలీజ్ కానున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రానికి ఊహించని లాభం దక్కింది.
తమిళనాడులోని ప్రధాన థియేటర్లలో ‘జన నాయగన్’ కోసం కేటాయించిన స్క్రీన్‌లు ఇప్పుడు ‘రాజా సాబ్’కు బదిలీ అవుతున్నాయి. పండుగ సీజన్, పెద్ద సినిమాతో పోటీ లేకపోవడం వలన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
ఈ అనూహ్య పరిణామం ప్రభాస్ అభిమానులకు పండుగను ముందే తీసుకొచ్చింది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నందున, సెన్సార్ సమస్యలు ఎదుర్కొన్న విజయ్ సినిమాకు వాయిదా పడడం ‘రాజా సాబ్’కు బాక్సాఫీస్‌లో అదనపు జాక్‌పాట్ అందించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.









