బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లి కానున్న విషయం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె, రెండోసారి సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం షేర్ చేసిన కొత్త ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ శారీలో సంప్రదాయభరితమైన లుక్‌తో కనిపించిన సోనమ్, స్టమక్‌పై చేయి వేసి దిగిన ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
సోనమ్ ఈ ఫొటోషూట్‌ను తన హృదయానికి దగ్గరైన క్షణాలుగా భావిస్తూ, అందమైన క్యాప్షన్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన పిక్స్ చూసి అభిమానులు, సహచర నటులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మూమెంట్‌ను సెలబ్రేట్ చేస్తూ ఆమెపై ప్రేమ, ఆప్యాయతల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో “కంగ్రాట్స్ సోనమ్”, “గాడ్ బ్లెస్”, “బ్యూటిఫుల్ మామా” వంటి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
సోనమ్ కపూర్ 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. పెళ్లి తర్వాత కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తూ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సోనమ్, ప్రస్తుతం పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయిస్తోంది. తన భర్త, కొడుకుతో కలిసి అనేక సందర్భాల్లో కనిపిస్తూ క్వాలిటీ ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
సోనమ్ సినీ ప్రయాణం కూడా విశేషమే. 2005లో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘బ్లాక్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం 2007లో వచ్చిన ‘సావరియా’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ‘రాంజనా’, ‘నీర్జా’, ‘డోలే రా డోలే’ వంటి పలు చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రెండోసారి తల్లి కానున్న సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న ఆమె తాజా ఫొటోలు ఇంటర్నెట్‌ను హీట్ చేస్తున్నాయి.









