కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘D55’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, గోపురం ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. కథ, కథనం పరంగా కొత్తదనం ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ధనుష్ కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా D55 నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో మూవీ టీమ్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్‌ను షేర్ చేసింది. D55 చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీలను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, “ఇది వస్తుందని మీరు ఊహించలేదు.. D55లో ఉన్న అద్భుతమైన అమ్మాయి శ్రీలీలకు స్వాగతం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
పోస్టర్‌లో ధనుష్ చేతులు కట్టుకొని స్టైలిష్‌గా నిలబడగా, శ్రీలీల చేతిలో బొకే పట్టుకొని క్యూట్ స్మైల్‌తో కనిపించింది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కాంబినేషన్ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుండగా, ఈ సినిమా శ్రీలీల కెరీర్‌కు మరో పెద్ద విజయాన్ని అందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.









