యంగ్ హీరో దీక్షిత్ శెట్టి ‘ముగ్గురు మొనగాళ్లు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ‘దసరా’ మూవీలో సూరి పాత్రతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. తెలుగులో తన ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు.
‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీసులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రష్మిక మందన్న, అను ఇమాన్యుయెల్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం దీక్షిత్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు అభిషేక్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్నారు. బృందా ఆచార్య హీరోయిన్‌గా నటించింది. చిత్రం నవంబర్ 27న రిలీజ్ అవుతుంది.
ఓ ఇంటర్వ్యూలో దీక్షిత్ శెట్టి రష్మిక వ్యక్తిగత జీవితం గురించి స్పందిస్తూ, ‘‘ఆమె ప్రేమ, ఎంగేజ్‌మెంట్ గురించి ఎప్పుడూ చర్చించలేదు. మేం సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతాము’’ అన్నారు. ఈ నేపథ్యంలో రష్మిక-విజయ్ ఎంగేజ్‌మెంట్ వార్తలు ఇంకా సీక్రెట్‌గా కొనసాగుతున్నాయి.









