ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – 265 మంది మృతి

Air India flight to London crashes after takeoff from Ahmedabad, killing 265. Tata Group mourns the tragedy and assures full support to victims’ families.

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 171 గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంతో దేశాన్ని కలచివేసే దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం. ఇది టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు గా మారింది.

ఈ విషాద ఘటనపై టాటా సన్స్ మరియు ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “మేం అనుభవిస్తున్న దుఃఖాన్ని మాటల్లో వర్ణించలేం. బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము” అని పేర్కొన్నారు. టాటా గ్రూప్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం, గాయపడిన వారికి వైద్య సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. ఎయిర్ ఇండియా భద్రత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ప్రమాద స్థలానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విమాన ప్రమాదంపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతను సమీక్షించేందుకు nation-wide technical inspection ప్రారంభమైంది. ఈ ప్రమాదం కారణాలపై పూర్తి పారదర్శకంగా నివేదిక అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

బాధితుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు టాటా గ్రూప్ ప్రత్యేక హాట్‌లైన్‌లు, సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పునర్నిర్మాణానికి కూడా గ్రూప్ సహాయం అందించనుంది. “ఇది మానవతా సంక్షోభం. బాధితుల కోసం మేము బాధ్యతగా, కరుణతో పనిచేస్తాము” అని సంస్థ తెలిపింది. ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share