ఐపీఎల్ విజయం నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాజకీయ వేడెక్కుతోంది. ఈ ఘటనపై ఇటీవల కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో విరాట్ కోహ్లీ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తప్పుబట్టడం బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కర్ణాటక బీజేపీ నేతలు, ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత అరవింద్ తీవ్రంగా స్పందించారు. “ఐపీఎల్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్రెడిట్‌ను విరాట్ కోహ్లీ, ఆర్సీబీపై నిందలుగా మార్చింది,” అని ధ్వజమెత్తారు. ఆర్సీబీ మాత్రమే వేడుకలకు పిలవలేదని, కాంగ్రెస్ నాయకులే ప్రజలకు ఆహ్వానం పంపించారని గుర్తు చేశారు.
ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని అరవింద్ అన్నారు. “ఒకవేళ కోహ్లీ, ఆర్సీబీ తప్పయితే, పోలీసులు ఎందుకు సస్పెండ్ చేశారు? అనుమతి నిరాకరించాల్సిన సమయంలో ఎందుకు అనుమతిచ్చారు? అప్పటికి క్రెడిట్ తీసుకోవడం ఎలా? ఇప్పుడు మాత్రం నిందలు వేయడం ఎలాంటి తర్కం?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
విద్యుత్ కాంతులతో, సినీ/glamour హంగులతో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రమేయం ఉన్నప్పుడు… బాధ్యతను నెత్తికెత్తుకోవాలన్నారు. ఒక్క రాయల్ ఛాలెంజర్స్ లేదా కోహ్లీపై నిందలు వేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, తర్వాత రాజకీయ లబ్ధి కోసం ఈ విధమైన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి శోభాయమానమవ్వవని బీజేపీ తేల్చిచెప్పింది.









