పెళ్లి ఒత్తిడితో కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య

Kannada and Tamil serial actress Nandini died by suicide in Bengaluru, reportedly due to marriage pressure and depression.

పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో ప్రముఖ కన్నడ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులోని తన నివాసంలో నందిని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సినీ, టెలివిజన్ రంగంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందిని వదిలిన సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులు పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నారని, తాను మానసికంగా పెళ్లికి సిద్ధంగా లేనని పేర్కొంది. అలాగే కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నందిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిగా తెలుస్తోంది. అయితే కన్నడ, తమిళ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళంలో ప్రసారమైన ‘గౌరి’ సీరియల్‌లో కనకదుర్గ పాత్రలో డబుల్ రోల్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ పాత్ర ఆమెకు విశేషమైన అభిమానాన్ని తీసుకొచ్చింది.

అదేవిధంగా కన్నడలో ‘జీవా హూవాగిడే’, ‘సంఘర్ష’, ‘మధుమగలు’ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందింది. నటి అకాల మరణంతో అభిమానులు, సహనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. నందిని మృతి టెలివిజన్ పరిశ్రమలో తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share