ఎంఎల్‌సీలో అగ్ని చోప్రాకి అరుదైన అవకాశం

Agni Chopra playing for MI New York in MLC raises curiosity over BCCI rules and his unique eligibility case.

ప్రఖ్యాత దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా, అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో ఎంఐ న్యూయార్క్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 26 ఏళ్ల అగ్ని, భారత దేశవాళీ క్రికెట్‌లో కూడా రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. అతను విదేశీ లీగ్‌లో పాల్గొనడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది, ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం, యాక్టివ్ క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడానికి అనుమతించరు.

అయితే, అగ్ని చోప్రా విషయంలో ప్రత్యేకత ఉంది. అతడు అమెరికాలో మిచిగాన్‌లో జన్మించడంతో, అతడి వద్ద భారతీయ పాస్‌పోర్ట్ లేదు. ఈ కారణంగా బీసీసీఐ నియమాలు అతడిపై వర్తించవు. భారత పౌరసత్వం లేనివారికి దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతినిచ్చినప్పటికీ, మళ్లీ భారత పౌరసత్వం లేకపోతే ఆయా లీగ్‌ల్లో కొనసాగలేరు. ఇది అగ్ని భవిష్యత్‌పై ఆసక్తికర పరిస్థితిని కలిగిస్తోంది.

అగ్ని చోప్రా గతంలో దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ కనబర్చిన ఆటగాడు. 2023-24 రంజీ ట్రోఫీలో మిజోరం తరఫున ఆడిన అతడు, తొలి నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన అరుదైన ఘనత సాధించాడు. అతడి బ్యాటింగ్ నైపుణ్యం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఐపీఎల్‌కి ఎంపిక కావడం మాత్రం అతడికి జరగలేదు.

ఐపీఎల్‌లో ఆడాలనే తన కల గురించి ఓ ఇంటర్వ్యూలో అగ్ని స్పందించాడు. “ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి అవకాశం వస్తే నేను భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసేవాడిని. కానీ ప్రస్తుతం అమెరికాలో నా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. భారతీయ క్రికెట్‌లో అగ్ని కొనసాగాలంటే పౌరసత్వం కీలకం కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share