బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరు చేసింది. రెండో రోజు లంచ్ అనంతర సెషన్లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 515 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడి ప్రత్యర్థి పైన కట్టుదిట్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. గిల్ 340 బంతుల్లో 27 బౌండరీలు, 2 సిక్సర్లు సాధించి అజేయంగా 234 పరుగులతో క్రీజులో నిలిచాడు. కెరీర్లో ఇదే అతడి తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. గిల్ స్థిరత్వం, ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు పెట్టాడు.
అతనికి రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87)లు కీలకంగా సహకరించి జట్టు స్కోరు పెంచడంలో ప్రధాన పాత్ర పోషించారు. జడేజా, జైస్వాల్ ఇద్దరూ స్ధిరంగా ఆడి ఇన్నింగ్స్‌కు మద్దతు ఇచ్చారు. ఆరంభంలో కేఎల్ రాహుల్ త్వరగా ఔటైనప్పటికీ, తరువాత వచ్చిన బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అలాగే, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ తీశారు. గిల్ చివరికి వాషింగ్టన్ సుందర్ (26*)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తూ భారత జట్టు భారీ స్కోరుకు దారితీసాడు. ఈ ప్రదర్శనతో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది.









