వినియోగదారుల సౌలభ్యం కోసం గూగుల్ తన జీమెయిల్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనివల్ల వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌ను క్లీన్‌గా ఉంచుకోవచ్చు. కొత్తగా పరిచయం చేసిన ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’ ఫీచర్ ద్వారా అవసరం లేని మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఆఫర్లు, ప్రకటనలు, న్యూస్‌లెటర్ మెయిల్స్‌ను తగ్గించడంలో దోహదం చేస్తుంది.
ఈ ఫీచర్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన అన్ని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒకేచోట చూడగలుగుతారు. అక్కడే ప్రతి మెయిల్ పక్కన ‘Unsubscribe’ బటన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే, జీమెయిల్ ఆ మెయిల్ పంపినవారికి అన్‌సబ్‌స్క్రయిబ్ అభ్యర్థన పంపుతుంది. తద్వారా భవిష్యత్తులో ఆ తరహా మెయిల్స్ రాకుండా చేస్తుంది.
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, జీమెయిల్ ఖాతాలో ఎడమవైపు ఉన్న నావిగేషన్ బార్‌లో ‘Manage Subscriptions‘ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఇకపై ఒక్కో మెయిల్ ఓపెన్ చేసి అన్‌సబ్‌స్క్రయిబ్ లింక్ వెతకాల్సిన అవసరం లేకుండా, ఒకే చోట నుండి అన్ని సబ్‌స్క్రిప్షన్‌లను సులభంగా నిర్వహించవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, అవసరమైన మెయిల్స్‌ను త్వరగా గుర్తించేందుకు సహాయపడుతుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్రకారం, ఈ ఫీచర్ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. ఇది గూగుల్ వర్క్‌స్పేస్ వినియోగదారులు, వర్క్‌స్పేస్ ఇండివిజువల్స్ మరియు వ్యక్తిగత ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది.









