తెలంగాణలో ఈ రోజు నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాల్లో ప్రజలు గజ గజా వణుకుతూ కష్టపడి ఉంటున్నారు. గ్రామ ప్రాంతాల్లో ఉదయం పొగమంచు కప్పబడి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు కూడా బయటకు వెళ్ళడం కష్టమని ప్రజలు వాపోయారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినట్లుగా, రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. దీంతో ప్రజలు చలికాలానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డిసెంబర్ 13న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
డిసెంబర్ 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రజలు చలి వలన గాయాలు, జ్వరం, జలుబు వంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది.









