యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన ఏషగోని చిత్తారమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ మానవతా దృక్పథంతో స్పందించారు.
బుధవారం రాత్రి మృతురాలి నివాసానికి వెళ్లిన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతురాలి దశదినకర్మకు అవసరమైన ఒక క్వింటాల్ బియ్యాన్ని తన వంతు సాయంగా అందజేశారు.
కష్టకాలంలో గ్రామ పెద్దగా బాధిత కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యత అని సర్పంచ్ తెలిపారు. భవిష్యత్తులో కూడా చిత్తారమ్మ కుటుంబాన్ని ఆదుకుంటూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ చూపిన ఈ మానవత్వానికి గ్రామస్థులు ప్రశంసలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్తో పాటు గ్రామ పెద్దలు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, ఊదరి లింగయ్య, ఊదరి శంకర్, పిసాటి భూపాల్ రెడ్డి, జంగం అంజయ్య, తదితరులు పాల్గొని కుటుంబానికి సానుభూతి తెలిపారు.









