భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ముందంజ

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ శాఖ ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా చూడగలగాలి అని ఆయన అన్నారు.
డెలీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం మరో టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని పేర్కొన్నారు.
మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా, ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషణ చేయగలదని, నిర్ణయాలు తీసుకోవగలదని సీఎం వివరించారు. రోబోటిక్స్‌తో ఏఐ కలిసినప్పుడు, యంత్రాలు కేవలం శారీరక సామర్థ్యంతో మాత్రమే కాకుండా మానసిక మేధస్సుతో కూడిన శక్తిని కూడా పొందుతున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయమేమిటంటే, ఏఐ మన భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతోందని, దీనిని సరైన విధానాలు, నియంత్రణలతో సమర్థవంతంగా ఉపయోగించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటే అవసరం అని ఆయన ఫోకస్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share