పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ సినిమా భారీ అంచనాలతో జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ ఫాంటసీ, హారర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ప్రయాణం ఊహించని విధంగా తారుమారైంది.
ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్, గ్లామర్, విజువల్స్ ఉన్నప్పటికీ కథనం, స్క్రీన్‌ప్లే లోపాల కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సినిమా విఫలమైంది. ఫలితంగా ప్రభాస్ కెరీర్లో మరో నిరాశాజనక ఫలితంగా ‘రాజాసాబ్’ నిలిచింది.
సినిమాకు వస్తున్న విమర్శలను గమనించిన చిత్ర యూనిట్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొన్ని సీన్లను తొలగించి, మరికొన్ని కొత్త సీన్లు జోడించి సినిమాను రీ-ఎడిట్ చేసి మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఈ మార్పులు కూడా ప్రేక్షకుల అభిప్రాయాన్ని పూర్తిగా మార్చలేకపోయాయి. చివరికి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితంతో థియేట్రికల్ రన్ ముగించింది.
ఇక ఇప్పుడు ‘రాజాసాబ్’ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఓటీటీలో అయినా ఈ సినిమాకు న్యాయం చేస్తారా? లేక అక్కడ కూడా అదే ఫలితాన్ని చవిచూస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.









