భారత్ ఏఐలో గ్లోబల్ లీడర్ అవ్వాలి: సీఎం

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని భారత్ ఏఐ సమ్మిట్-2026లో అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐ అభివృద్ధికి ప్రత్యేకమైన స్ట్రాటజీలు అమలు చేయాలని, రాష్ట్రం ప్రధానంగా ముందడుగు వేయాలని ఉద్దేశించారు.ముఖ్యమంత్రి ఏఐ అభివృద్ధికి ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన ప్రకారం, హైదరాబాద్ ఈ వార్ రూమ్ కోసం అత్యంత అనువైన ప్రదేశం. ఇప్పటికే ఈ నగరంలో సకల వసతులతో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేశామన్నారుప్రతి ఆరు నెలలకు హైదరాబాద్ వంటి నగరాల్లో ఐఏ సదస్సులు నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. అంతేకాక, జీఎస్టీ కౌన్సిల్ వంటి ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టంచేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share