సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం ఓమ్ని వ్యాన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై రైల్వేగేట్ సమీపంలో జరిగింది.
వాహనం ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మొరాయించడం వల్ల డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో మంటలు వ్యాపించాయి.
వాహనం సిఎన్‌జీ ఆధారితంగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడి వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బయటకు పరుగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన వల్ల కొంతసేపు జహీరాబాద్-బీదర్ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించి, రహదారిని త్వరగా స్వాధీనం చేసుకున్నారు.
Post Views: 12









